calender_icon.png 29 January, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పుడు సమాచారం ఇచ్చిన బీగాల గణేష్ గుప్తాపై చర్య తీసుకోవాలి

27-01-2025 07:35:41 PM

అదే ప్రవీణ్ కుమార్...

నిజామాబాద్ (విజయక్రాంతి): అర్బన్​ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారులకు తప్పుడు అఫిడవిట్​లు ఇచ్చి మోసానికి పాల్పడ్డారని సీనియర్​ కాంగ్రెస్​ నాయకుడు ఆదె ప్రవీణ్​కుమార్​ ఆరోపించారు. నగరంలోని కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మాక్లూర్​ మండలంలో 9.16 ఎకరాలను కేవలం రూ. 4 లక్షలకే కొన్నట్లు అధికారులకు ఇచ్చిన పత్రాల్లో చూపారని.. కానీ ఆ ఆస్తి విలువ రూ.2.70 కోట్లు ఉందన్నారు. ఇలా ఆయన అఫిడవిట్​లో తప్పుడు సమాచారం ఇచ్చి అధికారులను, నగర ప్రజలను మోసం చేశారని.. పూర్తి విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అదే ప్రవీణ్ అధికారులను కోరారు.