calender_icon.png 31 October, 2024 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్ ప్లాన్ అమలుకు యాక్షన్ ప్లాన్

30-08-2024 02:08:47 AM

  1. చట్టం అమలుపై ఆర్థిక శాఖ ప్రత్యేక దృష్టి 
  2. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు ప్రాధాన్యత
  3. ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రణాళికలు
  4. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఆగస్టు 29(విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని అధి కారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. చట్టం అమలు చేయడంపై ఆర్థిక శాఖ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సబ్ ప్లాన్ అమలుకు ఆర్థిక శాఖ నుంచి ప్రత్యేక అధికారి నిత్యం అన్ని శాఖలను సమన్వయం చేయాలని సూచించారు.

గురు వారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ప్రణాళికల గురించి వివిధ శాఖ ల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు కోసం సబ్ ప్లాన్ నిధులలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు. సబ్ నిధుల కేటాయింపులో విద్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూ చించారు. అంగన్వాడీలు, పాఠశాలల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఆ తర్వాత కమ్యూనిటీ హాల్స్, అంతర్గత రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలు ఇతర మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలన్నారు. సబ్ ప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చిన స్ఫూర్తిని కొనసాగించే విధంగా అధికారుల పని విధానం ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఎ స్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపడానికి  సబ్ ప్లాన్ చట్టాన్ని వంద శాతం పూర్తిస్థాయిలో అమలు చేయాలని  ఆదేశించారు. అన్ని శాఖల్లో ఉన్న అధికారులు సబ్ ప్లాన్ చట్టాన్ని అర్థం చేసుకొని చట్టం ప్రకారం ఆ నిధులను వారికే ఖర్చు పెట్టాలన్నారు. 

భూముల అభివృద్ధికి ఇందిరా జలప్రభ.. 

యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత అన్ని శాఖల అధికారులకు నిధుల కేటాయింపు, ఖర్చు పైన అవగాహన కార్యక్ర మాన్ని నిర్వహిస్తామని భట్టి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల భూములను అభివృద్ధి చేయడానికి ఇందిరా జల ప్రభ పథకం అమలు కోసం అధికారులు ప్రణాళికలు సిద్ధం చే యాలన్నారు. మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు దళిత, గిరిజనుల వ్యవసాయం కోసం బోర్లు వేయించాలని,  చెక్ డ్యాములు నిర్మించాలని చెప్పారు.

ఆదివాసీ పోడు  రైతులకు ఆదాయం వచ్చే విధంగా, అడవిని కాపాడుకునే విధంగా పామ్ ఆయిల్, పండ్ల తోటల పెంపకం, అంతర్గత పంటల సాగుకు డిజైన్ చేయాలన్నారు. -ఆదాయం పెరిగేందుకు కొత్త పథకాలను తీసుకురావాలని సూచించారు.  గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో  సబ్ ప్లాన్ నిధుల కేటాయింపు, నిధుల ఖర్చు గురించి అధికారులను అడిగి ఆరా తీశారు. 

ప్రజా ప్రభుత్వంలో సబ్ ప్లాన్ చట్టం ప్రకారంగా 24 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టడానికి అధికారులు కచ్చితంగా దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా, ఎనర్జీ సెక్రెటరీ రోనాల్డ్ రోస్, సోషల్ వెల్ఫేర్ కమిషనర్ శ్రీదేవి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీ శరత్, హౌసింగ్ కార్పొరేషన్ ఎంండీ గౌతమ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.