- గ్రేటర్ తాగునీరు, సీవరేజీ ప్రణాళిక రూపొందించాలి
వేసవిలో మంచినీటి ఎద్దడి రానివ్వొద్దు
జలమండలి బోర్డు సభ్యులతో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డి
సొంత ఆదాయ మార్గాలు అన్వేషించాలని దిశానిర్దేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3(విజయక్రాంతి): 2050 నాటికి గ్రేటర్‌వాసుల మంచినీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని యాక్షన్ ప్లాన్ రూపొందిం రోచుకో ఇందులో భాగంగా గతంలో ప్రతిపాదించిన 15 టీఎంసీలకు బదులు 20 టీఎంసీల నీటిని తెచ్చుకునేలా మార్పులు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం బంజారా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో జలమండలి బోర్డు సభ్యులతో జరిగిన సమావేశంలో బోర్డు చైర్మన్ హోదాలో హాజరైన సీఎం మాట్లాడుతూ.. ఇంటింటికీ తాగునీటితో పాటు సీవ ప్లాన్‌ను రూపొందించాలని, అవసరమైతే ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్య చేయించాలన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఉన్న జనాభాకు సరిపడే తాగునీటిని సరఫరా చేస్తున్నామని, మొత్తం 9,800 కిలోమీటర్ల మంచి నీటి సరఫరా నెట్వర్క్ ద్వారా 13.79 లక్షల కనెక్షన్లకు నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు సీఎంకు నివే మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నుంచి సిటీకి ప్రస్తుతం నీటి సరఫరా జరుగుతోందని, గోదావరి ఫేజ్ ద్వారా మరింత నీటిని తెచ్చుకొని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వరకు తాగునీటి సరఫరాకు డిజైన్ చేసిన ప్రాజెక్టుపై సమావేశంలో చర్చ జరిగింది.
మల్లన్న సాగర్ నుంచే తాగునీటి సరఫరా..
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నిర్దేశించిన గోదావరి ఫేజ్ ప్రాజెక్టుకు మల్లన్నసాగర్ నుంచి నీటిని తీసుకోవాలా.. కొండపోచమ్మ సాగర్‌ను నీటి వనరుగా ఎం అనే అంశంపై సమావేశంలో చర్చించారు. కన్సల్టెన్సీ ఏజెన్సీలు ఇచ్చిన రిపోర్టుతో పాటు నీటి లభ్యత ఎక్కువగా ఉండటం, లిఫ్టింగ్ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని మల్లన్నసాగర్ నుంచే తాగునీటి సర ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
అలాగే సీఎం సూచన మేరకు గతంలో ప్రతిపాదించిన 15 టీఎంసీలకు బదులు, సిటీ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీల నీటిని తెచ్చుకునేలా మార్పులకు ఆమో తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జలమండలి ఆదాయ వ్యయాల నివే ఎండీ అశోక్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు.
సొంత ఆదాయ మార్గాలను అన్వేషించాలి..
జలమండలి తమ సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని, అందుకు అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఇప్పటికే 20వేల లీటర్ల నీటిని సిటీలో ఉచితంగా సరఫరా చేస్తున్నందున, ఇతర కనెక్షన్ల నుంచి రావాల్సిన నల్లాబిల్లు బకాయిలు క్రమం తప్పకుండా వసూలయ్యేలా చూడాలన్నారు.
జలమండలి కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవాలని, తక్కువ వడ్డీతో రుణాలు తెచ్చుకునే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని సూచించారు. అందుకు వీలుగా ప్రాజెక్టు డీపీఆర్‌లు తయారు చేయించాలని చెప్పారు. అలాగే వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం.. అధికారులను ఆదేశించారు.
కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం ఆధ్వర్యంలో ఇలాంటి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్, జీహెఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జలమండలి రెవెన్యూ లోటు రూ.8,800కోట్లు
వివిధ ప్రభుత్వ విభాగాలు, కార్యాలయాల నుంచి దాదాపు రూ.4,300 కోట్ల బకాయిలు జలమండలికి రావాల్సి ఉందని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జలమండలి కరెంటు బిల్లులు దాదాపు రూ.5,500 కోట్లు బకాయిలున్నాయన్నారు. రూ.1,847 కోట్లు గతంలో తీసుకున్న అప్పులున్నాయని, దాదాపు రూ. 8,800 కోట్ల రెవెన్యూ లోటు ఉందని వివరించారు.
1965 నుంచి మంజీరా ద్వారా నగరంలోని పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్న పైపు లైన్లకు కాలం చెల్లిందని, దీంతో రిపేర్లు వస్తే దాదాపు పది నుంచి 15 రోజులు నీటి సరఫరా నిలిచిపోతోందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ పాత లైన్ వెంబడి ప్రత్యామ్నాయంగా మరో అధునాతన లైన్ నిర్మించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అవసరమైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ ద్వారా నిధులు తెచ్చుకునేందుకు వీలుగా ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదాయ వ్యయాలు ఆశాజనకంగా లేవని, వీటిని అధిగమించేందుకు ఆర్థిక శాఖ సమన్వయంతో తక్షణ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు.