26-04-2025 12:38:44 AM
జేబులు నింపుకునేందుకే కాళేశ్వరం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : ప్రజలను తాకట్టుపెట్టి రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, ప్రణాళిక లేకుండా నాసిరకం మెటీరియల్‌తో నిర్మించారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును రైతుల కోసం కాదు.. జేబులు నింపుకోవడానికి కట్టిందని మండిపడ్డారు. ఆ నాసిరకం నిర్మాణంపై బీఆర్ ఎస్ నేతలు సిగ్గుపడాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు.
తాజా గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుది రిపోర్టును రాష్ర్ట ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో సమగ్ర అధ్యయనం అనంతరం కేబినెట్‌లో చర్చించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశా రు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయ న మీడియాతో మాట్లాడుతూ, ప్రాజెక్టుకు డిజైన్ మొదలు.. నిర్మాణం, కూలి పోవడం అంతా బీఆర్‌ఎస్ హయాంలోనే జరిగిందన్నారు.
రైతులకు బీఆర్ ఎస్ క్షమాపణ చెప్పాలని మంత్రి పేర్కొన్నారు. చేసిందంతా చేసినా ఇంకా బీఆర్‌ఎస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తూనే ఉన్నారని అన్నారు. కాళేశ్వరం నిర్మాణం కోసం అధిక వడ్డీలతో లక్ష కోట్ల అప్పులు తీసుకువచ్చి రాష్ట్రా న్ని అధోగతిపాలు చేశారని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న తప్పిదాలపై ప్రజలకు బీఆర్‌ఎస్ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పా లని డిమాండ్ చేశారు.
మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నా రికార్డు స్థాయిలో పంటలు పండాయని అన్నారు. ఉగ్రదాడికి కారకులైన హంతకులను అత్యంత కఠినంగా శిక్షించాలని మంత్రి ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి పేర్కొన్నారు. అభం శుభం ఎరుగని టూ రిస్టులను చంపడం అత్యంత దుర్మార్గమైన చర్య గా ఆయన అభివర్ణించారు. తనకు జమ్మూకశ్మీ ర్ పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉందని తెలిపారు.
కశ్మీర్‌లో తాను సైన్యంలో పనిచేశానని, సియాచిన్ గ్లేసియర్‌లో వాయుసేన నిర్వ హించిన ఆపరేషన్‌లోనూ పాల్గొన్నట్లు వెల్లడించారు. శ్రీనగర్ పట్టణానికి సమీపంలోనీ అవం తిపురంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాల పైలెట్‌గా పనిచేసినట్లు గుర్తు చేసుకున్నారు. లడక్‌లో పనిచేసిన అనుభవమూ ఉందన్నారు. పెహల్గాం లాంటి విపత్కర పరిస్థితుల్లో దేశమంతా సంఘటితం కావాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని కోరారు.