calender_icon.png 6 March, 2025 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘క్రమశిక్షణ పాటించకుంటే చర్యలు’

06-03-2025 12:13:26 AM

హైదరాబాద్, మార్చి 5 (విజయ క్రాంతి): క్రమశిక్షణ పాటించని వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని, కార్యక ర్త నుంచి ఎంత పెద్ద వారైనా చర్యలు ఒకే విధంగా ఉండాలని మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ అన్నారు. గతంలో కొందరు పెద్ద నాయకులకు నోటీసు లు ఇచ్చి చర్యలు తీసుకోని విషయంపై అప్పటి పీసీసీ అధ్యక్షులు, క్రమశిక్షణ సంఘం చైర్మన్ సమాధానం చెప్పాల న్నారు. బుధవారం ఆయన గాంధీభవ న్‌లో మీడియాతో మాట్లాడారు.

తీన్మా ర్ మల్లన్నకు బీసీ కుల గణనపై అను మానాలు ఉంటే  సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితర సభ్యులను అడగవ చ్చన్నారు. అభ్యంతరాలు ఉంటే సీఎం తో మాట్లాడాల్సి ఉండేదని తెలిపారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజ్యాధికారంలో ఎస్సీ, ఎసీ,్ట బీసీ లాంటి అట్టడుగు వర్గాల పాత్ర ఇంకా తగ్గిపోయిందని, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో దొరల పాలన, కల్వకుంట్ల కుటుంబ దోపిడీ మాత్రమే జరిగిందన్నారు.