26-03-2025 12:00:00 AM
స్టూడియో ధ్వంసం సమర్థింపు
వ్యంగ్యానికి పరిమితి ఉండాలని హితవు
శివసేనను విమర్శిస్తూ కమ్రా మరో పాట
కమ్రాకు 5౦౦ బెదిరింపు కాల్స్
ముంబై, మార్చి 25: హాబిటాట్ స్టూడియోను శివసైనికులు ధ్వంసం చేయడాన్ని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే సమర్థించారు. చర్య ప్రతిచర్యకు కారణమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా తనపై చేసిన ‘గద్దార్’(ద్రోహి) వ్యాఖ్యలపై షిండే మంగళవారం మౌనం వీడారు. వ్యంగ్యాన్ని తాము అర్థం చేసుకుంటామని, కాకపోతే దానికి ఒక పరిమితి ఉండాలని ఆయన నొక్కి చెప్పారు.
‘ఒక వ్యక్తి ఒక నిర్ధిష్ట స్థాయిని కొనసాగించాలి. లేకపోతే చర్య ప్రతిచర్యకు కారణమవుతుంది. వాక్ స్వాతంత్య్రం ఉంది. మేము వ్యంగ్యాన్ని అర్థం చేసుకుంటాం. కానీ దానికంటూ ఒక పరిమితి ఉండాలి. వ్యతిరేకంగా మాట్లాడటానికి సుపారీ తీసుకుం ఇది ఉంది’ అని పేర్కొన్నారు. అలాగే కమ్రా గతంలో సుప్రీం కోర్టు, ప్రధా జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలపైనా కామెంట్ చేసినట్టు గుర్తు చేశారు.
ఇది వాక్ స్వాతంత్రం కాదని, మరొకరి కోసం పని చేస్తున్నట్టుగా ఉందని షిండే అభిప్రాయపడ్డారు. హాబిటాట్ స్టూడియోను ధ్వంసం చే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న క్రమంలో షిండే ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు షిండేపై కమ్రా చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కొందరు ప్రజలు వాక్ స్వాతంత్య్రాన్ని జన్మ హక్కుగా పరిగణించడం దురదృష్టకరమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా ఓ ఇంటర్యూలో అభిప్రా వాక్ స్వేచ్ఛ పేరుతో దేశాన్ని మరింత విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని యోగి ఆరోపించారు.
కమ్రా ఎవరి ముందూ తలవంచరు
కునాల్ కమ్రాకు శివసేన(యూబీటీ)నేత సంజయ్ రౌత్ మద్దతుగా నిలిచారు. తాను కమ్రా ఒకే డీఎన్‌ఏను కలిగి ఉన్నామని, క ఎవరీ ముందూ తలవంచరని సం పేర్కొన్నారు. ‘నాకు కమ్రా తెలుసు. మేమిద్దరం ఒకే రకమైన డీఎన్‌ఏ కలిగి ఉన్నాం. ఆయన ఒక పోరాట యోధుడు. క్ష చెప్పరు. ఒకవేళ ఆయనపై చర్యలు తీసుకోవాలి అనుకుంటే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి’ అని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సంజయ్ మీడియాతో మాట్లాడారు.
స్టూడియో ఒక వేదిక మాత్రమే
హాబిటాట్ కామెడీ స్టూడియోను బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు కూల్చి వేయడాన్ని కునాల్ కమ్రా తప్పుబట్టారు. వేదికను కూల్చడం సరికాదంటూ ఎక్స్ వేదికగా పోస్ట్‌పెట్టారు. ‘హాబిటాట్ స్టూడియో ఒక వేదిక మాత్రమే. ఇది అర్థం లేని చర్య. నాకు తెలిసినంత వరకు మన నాయకులను, సర్కస్ లాంటి రాజకీయ వ్యవస్థను అపహాస్యం చేయడం చట్ట వ్యతిరేకం కాదు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఒకప్పుడు ఏక్‌నాథ్ షిండే గురించి చెప్పినవే నేను ఇప్పుడు మాట్లాడాను.’ అని పోస్టులో పేర్కొన్నారు.
శివసేనను విమర్శిస్తూ కమ్రా మరోపాట
శివసేన కార్యకర్తలు హాబిటాట్ స్టూడియోను ధ్వంసం చేయడాన్ని విమర్శిస్తూ మరోపాట పాడారు. ‘హమ్ హూంగే కన్యా బ్’ పాట చరణాలు మార్చి ‘గుడ్డి నమ్మకం వల్ల మనం ఒకరోజు పేదవాళ్లమవుతాం. దేశం విధ్వంసం వైపు పయనిస్తోంది’ అనే అర్థం వచ్చేలా పాటను పాడారు.
500 బెదిరింపు కాల్స్
వివాదం చెలరేగిన నాటి నుంచి కునాల్ కమ్రాకు షిండే మద్దతుదారుల నుంచి సు మారు 500 బెదిరింపు కాల్స్ వచ్చాయని కమ్రా సన్నిహితులు పేర్కొన్నారు. ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తామంటూ మాట్లాడుతున్నారని వివరించారు. ముంబై పోలీసు ల ముందు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని కోరినట్టు వెల్లడించారు.