calender_icon.png 18 April, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాక్షన్ క్రెమ్ థ్రిల్లర్ బ్లడ్‌రోజెస్

03-04-2025 12:00:00 AM

రంజిత్‌రామ్, అప్సరరాణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్లడ్ రోజెస్’.  యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యం లో రూపొందుతున్న ఈ సినిమా ఎంజీఆర్ రచనాదర్శకత్వం వహించారు. టీబీఆర్ సినీ క్రియేషన్స్ పతాకంపై హరీశ్ కే నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రబృందం బుధవారం మీడి యా ముందుకొచ్చింది.

హైదరాబాద్‌లో జరిగి న ఈ సమావేశంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా హీరో రంజిత్‌రామ్ మాట్లాడుతూ.. ‘కర్ణాటకలో నేను కొన్ని సినిమాలు చేశాను. మంచి సినిమాతో తెలుగులో పరిచయం కావాలనుకుంటున్న సమయంలో ఈ కథ నా దగ్గరకు వచ్చింది.

కథ, కథనాలు నాకు బాగా నచ్చాయి’ అన్నారు. హీరోయిన్ అప్సరరాణి మాట్లాడుతూ.. ‘కొత్త జానర్‌లో విభిన్నమైన కథతో రూపొందిన ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది’ అని తెలిపారు. డైరెక్టర్ ఎంజిఆర్, నిర్మాత హరీశ్ కే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్, ఫైట్ మాస్టర్ నందు, పలువురు చిత్రబృందం ఈ వేదికపై తమ అనుభవాలు, అభిప్రాయాలను పంచుకున్నారు.