calender_icon.png 6 March, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు

05-03-2025 12:59:46 AM

కరీంనగర్ పోలీస్ కమిషనర్ -అభిషేక్ మొహంతి

కరీంనగర్ క్రైమ్, మార్చి4(విజయక్రాంతి): కమీషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల దృష్ట్యా నియమ నిబంధనలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత ఏసీపీ ల నుంచి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిర్వహించకూడదని తెలిపారు.  అనుమతులు లేకుండా ఎటువంటి సభలు సమావేశాలు,ర్యాలీలు నిర్వహించకూడదని  సంబంధిత అధికారుల నుండి  అనుమతులు తప్పనిసరి అని తెలిపారు అనుమతుల కోసం దరఖాస్తు చేయడం ద్వారా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా   అట్టి కార్యక్రమానికి తగిన విధంగా పోలీసు శాఖ భద్రతాపరమైన చర్యలు చేపడుతుంది అన్నారు.