21-04-2025 12:10:42 AM
ఫర్టిలైజర్ దుకాణాలపై దాడులకు ప్రణాళిక
నకిలీ విత్తన విక్రయాల కట్టడి పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొంద రు దళారులు అమాయక రైతులను ఆసరాగా చేసుకొని నాసిరకం విత్తనాలను అంట గడుతుంటారు. ఇలాంటి వ్యాపారుల నుంచి రైతులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టారు.
గద్వాల, ఏప్రిల్ 20 ( విజయక్రాంతి ) : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుంది. ఆ దిశగా రైతు సంక్షేమ పథ కాలను ప్రవేశపెట్టడంతోపాటు పంటకు గి ట్టుబాటు ధరను కల్పిస్తున్నారు. సాగు విస్తీ ర్ణం క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ఈ క్ర మంలో కేటుగాళ్లు నకిలీ విత్తనాల అవతారమెత్తారు. వివిధ కంపెనీలు మార్కెట్లోకి నకిలీ విత్తనాలను తీసకొస్తున్నాయి.
వీటిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల చర్యలను తీసుకుంటుంది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ శాఖ తో నకిలీ విత్తనాల అరికట్టడం పై సమీక్ష సమావేశాలను సైతం నిర్వహించి ఉన్నతాధికారులు పలు సూచనలు చేసారు. ఈ మేరకు అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. పంటల సాగు విషయంలో విత్తనమే ప్రధానమైనందున.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
వివిధ కంపెనీల పేరుతో నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించను న్నది. అధిక లాభాలకు ఆశపడి డీలర్లు గుట్టుచప్పుడు కాకుండా నకిలీలను రైతులకు విక్రయిస్తున్నారు. దీంతో రైతులు దిగుబడి రాక నష్టపోతున్నారు. అక్రమాలకు పాల్పడే డీలర్లకు చెక్ పెట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు చర్యలను చేపట్టింది. స్టాక్ వివరాలను ఎప్పటికప్పు డు ఆన్లైన్లో నమోదు చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి
విత్తనాలను కొనుగోలు చేయాలనుకుం టే లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దకే వెళ్లాలి. పేరుగాంచిన కంపెనీల విత్తనాలను మాత్రమే తీసుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించిన రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. క్యూఆర్ కోడ్, ప్యాకింగ్ ఉన్న విత్తనాలను మాత్రమే వినియోగించాలి.
ఈ విషయాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దు. కాసులకు కక్కుర్తి పడి డీలర్లు నకిలీ వాటిని విక్రయించి రైతుల పాపం మూటగట్టుకోవద్దు అని అధికారులు సూచిస్తున్నారు.
12 క్వింటాల 75 కేజీల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న మల్దకల్ పోలీసులు
మల్దకల్ మండల పరిధిలోని కుర్తి రావల చెరువు గ్రామ శివారు ప్రాంతంలోని వ్యవసాయ పొలంలో నమ్మదగిన సమాచారం మేరకు ఓ సబ్ ఆర్గనైజర్ కు సంబంధించి 12 క్వింటాల 75 కేజీల పత్తి విత్తనాలను వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ, సంయుక్తంగా దాడులు చేసి డoప్పు చేసిన 12 క్వింటాళ్ల 75 కేజీలు పత్తి విత్తనాల సంచులను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసారు.