22-02-2025 10:01:00 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యం కు సంబంధించిన సీఎంఆర్ బియ్యం ఇవ్వని రైస్ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ డిఎస్ఓ కిరణ్ కుమార్ తో కలిసి వివరాలు వెల్లడించారు. 2021 నుంచి 24 వరకు పెండింగ్లో ఉన్న సీఎంఆర్ బియ్యం ఇవ్వని రైస్ మిల్లర్ల పై ఆర్ఆర్ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికి 8 రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. సిఎంఆర్ బియ్యం సేకరణల కోసం జిల్లాలో నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ కారణంగా 93% సేకరణ పూర్తయిందని మిగతాది కడువులోగా పూర్తి చేయడం జరుగుతుంది అన్నారు. రేషన్ బియ్యం తో అక్రమాలకు పాల్పడితే రైస్ మిల్లులపై చర్యలు ఉంటాయన్నారు. ఇప్పటికీ 47 కోట్ల విలువచేసే బియ్యం పెండింగ్లో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రత్న కళ్యాణి అధికారులు గోపాల్ సిబ్బంది ఉన్నారు.