calender_icon.png 2 April, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటిపై ఫిర్యాదులొస్తే పంచాయతీ కార్యదర్శులపై వేటు తప్పదు..!

31-03-2025 03:46:18 PM

స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని తెలకపల్లి,  తాడూర్,  బిజినపల్లి,  తిమ్మాజిపేట, నాగర్ కర్నూల్ మండల పరిధిలోని గ్రామపంచాయతీలో తాగునీటి సమస్య పట్ల ఫిర్యాదులు వస్తే వెంటనే ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు లేదా బదిలీబేటు తప్పదని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం మీడియా ద్వారా ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఎండలు మండుతున్న వేళ మిషన్ భగీరథ, ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని బోరు మోటర్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఓవర్ హెడ్ ట్యాంక్ లను శుభ్రపరచాలని సూచించారు.

రాత్రిళ్ళు విషసర్పాలు సంచరించే అవకాశం ఉంటుందని విద్యుత్ స్తంభాలకు విద్యుత్ దీపాలను సరిచేయాలన్నారు. మురుగు కాలువలు చెత్త చెదారం ఎప్పటికప్పుడు శుభ్రపరచాలన్నారు. రాజకీయ నాయకులను కాకా పట్టడం మాని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. లేదంటే ఎంతటి వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. అంతకుముందు రంజాన్ పర్వదినం సందర్భంగా శ్రీపురం రోడ్డులోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.