29-04-2025 12:22:57 AM
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ర్ట సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ అన్నారు. సోమవారం ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మాడవేణి సునీల్ తో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ర్ట సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ , జిల్లా కన్వీనర్ మాడవేణి సునీల్ లు మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారంగా ముందస్తు అడ్మిష న్లు నిర్వహిస్తున్న జగిత్యాల ప్రవేట్, కార్పొరేట్ పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని కోరారు.
పాఠశాల ప్రాంగణంలో పుస్తకాలను అమ్ముతూ విద్యను పూర్తిగా వ్యాపారంగా మారుస్తున్నారని మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా మరికొన్ని పాఠశాలలు అనుమతులు లేకుండానే నడుస్తున్నా విద్యాధికారి పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులను మానసికంగా ఇబ్బందులు పెట్టే విధంగా అడ్మిషన్ నిర్వహిస్తూ ముందస్తు ఫీజులను దండుకుంటు న్నారని, కళాశాలలకు సెలవులు వచ్చినప్పటికీ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో ఇష్టాను సారంగా వేసవిలో కూడా తరగతులు నడిపిస్తూ ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కుతున్నా..
ఇంటర్ జిల్లా విద్యాధికారి చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. స్థానికంగా ఉన్న ప్రవేట్ డిగ్రీ,పీజీ కళాశాలలు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని యూనివర్సిటీ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యార్థుల వద్ద నుండి రు.5000 ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.దీనిపైన వెంటనే యూనివర్సిటీ ఉన్న త అధికారులు స్పందించి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య ను అందించే దిశగా సంబంధిత ప్రైవేట్ డిగ్రీ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు.
లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నగర కార్యదర్శి కుందారపు రాజు, జోనల్ ఇంచార్జ్ రాపాక నిఖిల్, నగర సంయుక్త కార్యదర్శి మనోజ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.