12-03-2025 11:16:49 PM
చర్ల,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నకిలీ మొక్కజొన్న విత్తనాలు, పురుగుమందులు సరఫరా చేసిన డీలర్లపై చర్యలు తీసుకోవాలని గొండ్వాన సంక్షేమ పరిషత్ బృందం డిమాండ్ చేసింది. బుధవారం నకిలీ మొక్కజొన్న బాండ్ విత్తనాలతో మోసపోయిన తిప్పపురం,రాళ్లపురం,గిసరెల్లి, చిన్నమిడిసీలేరు, శలమాల,ఉయ్యాలమడుగు, కొత్తూరు ఆ గ్రామాలకు సంబంధించిన రైతులను ఉయ్యాల మడుగు గ్రామంలో రైతులతో వారు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆదివాసి రైతులు వారికి జరిగిన మొక్కజొన్న బాండ్ పంట నష్టాన్ని, వివరిస్తూ లబోదిబోమన్నారు. దీనిపై సంఘ నాయకులు పాయం సత్యనారాయణ స్పందిస్తూ ఏజెన్సీలో పుట్టగొడుగుల్లా ఎలాంటి, అనుమతులు లేకుండా,నకిలీ విత్తనాలు మొక్కజొన్న బాండ్ పేరుతో అటవీ ప్రాంత ఆదివాసి రైతులకు ఒక ఎకరాకు మూడు టన్నులు దిగుమతి వస్తుందని చెప్పి టన్ను రూ 36వేల ఉంటుందని, అబద్ధపు ప్రచారం చేసి నకిలీ మొక్కజొన్న విత్తనాలు అంట కట్టేరని మండిపడ్డారు.
ఆ ప్రాంత రైతులు మొత్తం మూడు నెలలు కాయ కష్టం చేసి, అధిక దిగుబడి వస్తుందని రైతన్న ఆశతో పంట సాగు చేశారు తీరా చూస్తే ఆ పంటలో ఉన్న మొక్కజొన్నలు కనీసం కంకిలో గింజలు లేనటువంటి పరిస్థితి. దాపరించిందని అన్నారు. అటవీ ప్రాంత ఆదివాసి రైతులను నట్టేట ముంచిన డీలర్.వాసుబాబు ఏజెంట్ కొప్పుల.శ్రీనివాస్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ. ఏజెన్సీలో అటవి ప్రాంతా ఆదివాసులను మోసం చేసే వారిపై వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని, డీలర్.ఏజెంట్ నిర్వహిస్తున్న షాపుల పై తనిఖీలు జరిపి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ఆదివాసి రైతులకు ఎకరాకు రూ 65 వేల నష్టపరిహారం ఇవ్వాలని, గొండ్వాన సంక్షేమ పరిషత్ డిమాండ్ చేస్తుంది. రైతులకు న్యాయం చేయని ఎడల గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసులను ఐక్యం చేసుకొని, ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమం లో చర్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం. వరప్రసాద్. రైతులు.మడకం. జీవన్ వాసం. కన్నారావు. మడకం. రాజశేఖర్. శ్యామల. లక్ష్మణరావు,బాడిస, సర్వేశ్వరరావు,కుంజా. శ్రీను, శ్యామల.శేఖర్, వాసం. నాగేశ్వరావు, వాసం. వెంకటేష్ తదితర రైతులు పాల్గొన్నారు.