22-02-2025 12:00:00 AM
మందమర్రి, ఫిబ్రవరి 21 : సింగరేణిలో సుదీర్ఘకాలం యాక్టింగ్ నిర్వహిస్తున్న కార్మికులకు యాక్టింగ్ ప్రమోషన్లను వెంటనే కల్పించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాం అధ్యక్ష కార్యదర్శులు సాంబారు వెంకటస్వామి, అల్లి రాజేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏరియా ఎస్‌ఓటు జిఎం విజయప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు.
గత సంవత్సరం సెప్టెంబర్ లో భర్తీ చేసిన యాక్టింగ్ ప్రమోషన్లను డిసెంబర్ 2023 మస్టర్ల ప్రాతిపదికన తీసుకొని భర్తీ చేయడం జరిగిందని, దీనిలో చాలామంది యాక్టింగ్ మస్టర్లు లేక అరత సాధించక యాక్టింగ్ పోస్టులు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 2024 మస్టర్ల ప్రతిపాదికన తీసుకొని పెండింగ్ యాక్టింగ్ ప్రమోషన్లను భర్తీ చేయాలని, నూతన ఖాళీలను డిసెంబర్ 2024 వరకు జోడించి అన్నీ కలిపి భర్తీ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పిట్ సెక్రటరీలు సందీప్,రాజ్ కుమార్ మరియు కుమార్ యాదవ్, మహేందర్ గట్టు నర్సయ్య పాల్గొన్నారు.