calender_icon.png 20 October, 2024 | 1:58 PM

కొత్తగా ప్రయత్నిద్దామని ‘పుష్ప’గా నటించా

25-07-2024 12:05:00 AM

బహిష్కరణ సక్సెస్ మీట్‌లో అంజలి

యాభైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన టాలీవుడ్ నటి అంజలి ఇటీవల ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముఖేశ్ ప్రజాపతి విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో తెరకెక్కించిన ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న తరుణంలో మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నటి అంజలి మాట్లాడుతూ.. “ఏదైనా కొత్తగా ట్రై చేయాలనే క్రమంలోనే ‘పుష్ప’ అనే పాత్రను ఎంచుకున్నాను. ఈ కారెక్టర్ నాతో ఏడాదిన్నరకుపైగా ట్రావెల్ చేసింది. ఈ పాత్రను నేను అంత ఈజీగా వదిలి పెట్టలేను. ‘బహిష్కరణ’ను ఇంత గొప్పగా రాసిన ముఖేశ్ గారికి థ్యాంక్స్. నిర్మాత ప్రశాంతి సహకారం లేకుంటే ఇంత బాగా వచ్చేది కాదు” అని తెలిపారు. ఇంకా ఈ ఈవెంట్‌లో నటీనటులు, సాంకేతిక బృందం మాట్లాడారు.