30-04-2025 12:32:27 AM
ఎస్పీ పరితోష్ పంకజ్
పటాన్ చెరు, ఏప్రిల్ 29 :జన్నారం మండల ప్రజలంతా శాంతియుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. మంగళవారం ఊట్ల శివారులోని ఎన్‌ఆర్‌ఎస్ ఫంక్షన్ హాల్ లో పీస్ కమిటీ సమావేశాన్ని జిన్నారం పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ పరతోష్ పంకజ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని గుడ్డిగా ఎవరు నమ్మకూడదని, నిజానిజాలు ఏమిటో నిర్ధారించుకోవాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో ఎవరిని ఉపేక్షించమని తెలిపారు. జిన్నారంలో ఇటీవల జరిగిన ఘటనను ఊటంకిస్తూ తప్పిదాన్ని ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సంజీవ్ రావు, డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐలు నయిముద్దీన్, రవీందర్ రెడ్డి, ఎస్‌ఐ నాగలక్ష్మి, జిన్నారం మండల ప్రజలుపాల్గొన్నారు.