calender_icon.png 1 February, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగారెడ్డి జిల్లాలో 30, 30 (ఏ) పోలీసు యాక్ట్

01-02-2025 12:00:00 AM

సంగారెడ్డి, జనవరి 31 : జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు  నెల రోజుల పాటు  30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్  ఒక ప్రకటనలో తెలిపారు.   పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా, ప్రజాధనానికి నష్టం కల్గించే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు.

జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఇట్టి విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా సూచించారు.అనుమతి లేకుండా సభలు సమావేశాలు నిర్వహించే వారిపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.