14-02-2025 12:00:00 AM
హుజూర్ నగర్, ఫిబ్రవరి 13 : సూర్యా పేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ శివారు లోని రామస్వామి గట్టు వద్ద ప్రతి సంవ త్సరం జాతర మూడు రోజులు పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరు గుతుంది.
కానీ ప్రస్తుతం జాతర ఎప్పుడు ఏమిటి అనేది కూడా అర్థం కాకుండా నిర్వహిస్తు న్నారని,కనీసం స్వామి వారి కళ్యాణం ఎప్పుడు నిర్వహించ బోతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని, తెలియజేయాల్సిన బాధ్యతను అధికారులు మరచి పోయారే మోనని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
రామయ్య పైనే చిన్న చూపా అంటూ అధికారులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తు న్నారు. పరికర రామస్వామి వారికి సుమారు 450 ఎకరాల దేవుని మాన్యం ఉండేది.10 సంవ త్సరాల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇందిరమ్మ గృహాల కోసం సుమారు 75 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.
ఆలా వచ్చిన సుమారు 17 కోట్ల రూపాయలు డిపాజిట్స్ గా ఉన్నాయి. అలాగే 350 ఎకరాల సేద్యం భూమి ఉండ గా ఎకరాకు 5000 రూపాయల చొప్పున కౌలు నిర్ణయించి వసూలు చేస్తున్నారు.
ప్రతి సంవత్సరం సుమారుగా 17 లక్షల రూపాయల ఆదాయం సమకూరగా జాత రకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని, ప్రతి జాతర అంగరంగ వైభవంగా నిర్వహి స్తున్న తెలంగాణ రాష్ర్టము లో రామస్వామి గట్టు జాతరను మాత్రం రాను రాను విస్మరిస్తున్నారని ఆవేదన పలువురిలో వ్యక్తమవుతుంది.ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆలయ అభివృద్ధితో పాటు జాతరను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించాలని కోరుతున్నారు.