జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, జనవరి 8 (విజయక్రాంతి): జిల్లాలో స్వయం సహాయ సంఘాల ఆధ్వ ర్యంలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసు కునేందుకు 20 ఎకరాల భూమిని గుర్తించి నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపా రు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుపై బుధవా రం ప్రజాభవన్ నుంచి మంత్రులు సీతక్క, కొండ సురేఖలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ జిల్లాలోని చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి, చిగురుమామిడి, కొండాపూర్, సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు భూమిని గుర్తిం చినట్లు తెలిపారు.
అలాగే అన్ని మండ లాల్లోనూ స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ భూమిని గుర్తిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరె న్సులో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీఆర్డీవో శ్రీధర్, డీఎస్వో బాలమణి, డీఆర్వో పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.