18-03-2025 01:42:37 AM
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం రంగారెడ్డి జిల్లా యా చారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో రైతునుంచి పట్టా, ప్రభుత్వ భూములు కలిపి 14,021.12 ఎకరాలు సేకరించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఫా ర్మా సిటీ కోసం 19,333 ఎకరాల భూమిని సేకరించిన మాట వాస్తవమేనా? అని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ అడగ్గా.. పొం గులేటి సమాధానం ఇచ్చారు. గత సర్కారు 14,225.31 ఎకరాల భూసేకరణ చేయాలని నిర్ణయించిం దన్నా రు.
ఇందులో 14,021.12 ఎకరాలు సేకరించగా..మరో 204.19ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. పరిహా రం విషయంలో అవకతవకలు జరిగిన విషయం ప్రభుత్వం దృష్టికి వ చ్చిందని దీనిపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.