calender_icon.png 12 March, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెదలాలి: బెల్లంపల్లి ఏసీపీ ఏ. రవికుమార్

12-03-2025 07:34:17 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెదలాలని బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్(Bellampalli ACP A.Ravikumar) సూచించారు. బుధవారం బెల్లంపల్లి రూరల్ సీఐ కార్యాలయం(Bellampalli Rural CI Office)లో సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించవద్దని సూచించారు. ఎటువంటి భూ సెటిల్మెంట్లు చేయకూడదని, పంచాయతీలు తల దూర్చవద్దని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా క్రైమ్ లో పాల్గొంటే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరాలకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసు లకు వెంటనే తెలియపరచాలని కోరారు. ఎవరైతే సత్ప్రవర్తన కలిగి ఉంటారో వారి పేరు మీద ఉన్న రౌడీ షీట్లను తొలగిస్తామని చెప్పారు. కౌన్సిలింగ్ లో బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలొద్దీన్, తాళ్ళగురిజాల ఎస్ఐ చుంచు రమేష్, నెన్నల ఎస్ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.