calender_icon.png 28 November, 2024 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతంపేటలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పై ఏసీపీ రమేష్ విచారణ

28-11-2024 01:41:18 PM

ముత్తారం, విజయక్రాంతి: ముత్తారం మండలంలోని సీతంపేట గ్రామంలో గురువారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పై గోదావరిఖని  ఏసిపి మడత రమేష్ విచారణ చేపట్టారు. సీతంపేట గ్రామ మాజీ సర్పంచ్ పులిపాక నగేష్ తనను కులం పేరుతో దూషించాడని, అదే గ్రామానికి చెందిన అన్నం రాజమల్లు అనే వ్యక్తిపై గత నాలుగు రోజుల క్రితం ముత్తారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్సై నరేష్ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడంతో ఏసీపీ రమేష్ కేసుకు సంబంధించిన సాక్షులను గ్రామములో విచారించారు. ఏసీపీ వెంట ముత్తారం నరేష్ తదితరులు ఉన్నారు.