calender_icon.png 2 April, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లింలకు రస్నా పంపిణీ చేసిన ఏసీపీ

31-03-2025 04:23:26 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని అశోక్ నగర్ మస్జిద్ వద్ద సోమవారం రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ రస్నాను పంపిణీ చేశారు. ముందుగా ముస్లిం సోదరులకు ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షల అనంతరం ముస్లిం సోదరులు తమ కుటుంబాలతో రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని అభినందనీయమని అన్నారు. నెల రోజులపాటు కట్టిన ఉపవాస దీక్షలు క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన, ప్రేమ, దాతృత్వం, సోదర భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఆయన వెంట బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ ఎన్ .దేవయ్యతో పాటు ముస్లిం పెద్దలు ఉన్నారు.