బైంసా (విజయక్రాంతి): బైంసా మున్సిపల్ పాలకవర్గం గడువు తీరిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయన సోమవారం బైంసా మున్సిపాలిటీ సందర్శించి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ రాజేష్, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. అధికారులు పట్టణ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కరించాలని ఆదేశించారు.