18-04-2025 01:21:33 AM
గుజరాత్‌లో ఆ పార్టీని ఓడిస్తామన్నందుకే రాహుల్‌పై కుట్రలు
ప్రజాసమస్యలపై నిలదీస్తున్నందుకు ఈడీతో వేధింపులు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ ఆగ్రహం
సోనియా, రాహుల్‌పై ఛార్జిషీట్‌కు నిరసనగా ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా
కేంద్ర ప్రభుత్వంపై మండిపడిన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాం తి): గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు వస్తున్నామని పార్లమెంటు సాక్షిగా రాహుల్‌గాంధీ చెప్పినప్పటి నుంచే.. ప్రధాని నరేంద్రమోదీ కక్ష రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారా ల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ ఆరోపించా రు. బీజేపీ ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
నేషనల్ హెరా ల్డ్ విషయంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై ఈడీ వేసిన ఛార్జిషిట్‌కు నిరసనగా పీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. పేదల పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే ఈడీ కేసులు, విచారణ పేరు తో వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా ఉండేవని, అప్పుడు ఇందిరాగాంధీ న్యాయపోరాటం చేశారని, ఇప్పుడు మన వంతు వచ్చిందన్నారు. నేషనల్ హెరాల్డ్ విషయం లో లావాదేవీలే జరగలేదని, అలాంటప్పు డు మనీ లాండరింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు.
సంస్థ బైలాస్‌లోనే లావాదేవీ లు జరపవద్దని ఉందన్నారు. నేషనల్ హెరా ల్డ్ నాన్ ప్రాఫిట్ సంస్థ అని తెలిపారు. దేశం లో తెలంగాణ రాష్ట్రంలోనే కులగణన, ఎస్సీ వర్గీకరణ జరిగిందని, ఇవి దేశం మొత్తం జరగాలని రాహుల్‌గాంధీ కోరుతున్నారని తెలిపారు.
బీజేపీది ఫాసిస్టు పాలన: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు పాలన సాగిస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. రాహుల్‌గాంధీకి ప్రజల్లో పెరుగుతున్న ఇమేజ్‌ను చూసి మోదీ సర్కార్ ఓర్చుకోలేక అక్రమ కేసుల కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పేపర్ అయినా నేషనల్ హెరాల్డ్‌కు రూ.90కోట్ల రుణం ఇస్తే మనీలాండరింగ్ ఎలా అవుతుందని ప్రశ్నిం చారు.
కులగణనతో మోదీకి రాహుల్‌గాంధీ రాజకీయంగా మరణశాసనం రాశారని పేర్కొన్నారు. గాంధీ కుటుంబంపై కేసులతో పేరుతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న బీజేపీని దేశ ప్రజలు తరిమికొడుతారని పీసీ సీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు హెచ్చరించారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో ఉండాలని, అక్రమ కేసులు పెట్టి ఏదో చేద్దామనుకోవడం అవివేకమని హితవు పలికారు.
బీజేపీ గుండాయిజం చేస్తోంది: ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శి విశ్వనాథ్
దేశంలో బీజేపీ గుండాయిజం చేస్తోందని ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శి విశ్వనాథ్ మం డిపడ్డారు. బీజేపీ స్కామ్‌లు, అవినీతిపై రాహుల్ మాట్లాడుతుంటే కేసులతో ఇబ్బం ది పెట్టాలని చూస్తున్నారన్నారు.
కులగణనను అడ్డుకోవడానికే ఈ కుట్రలు: డిప్యూటీ సీఎం
దేశంలో కులగణనను అడ్డుకోవడానికే సోనియా, రాహుల్‌గాంధీపై కేంద్రం లోని బీజేపీ అక్రమ కేసులు నమోదుచేస్తూ కుట్రలకు పాల్పడుతోందని డిప్యూ టీ సీఎం భట్టివిక్రమార్క మండిపడ్డారు. ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఈవీఎంలకు బదులు.. బ్యాలెట్ పేపర్ పెట్టాలని ఏఐసీ సీ సమావేశాల్లో తీర్మానంతో బీజేపీకి భయం పట్టుకుందన్నారు.
కక్షపూరిత రాజకీయాలు సరికాదు: మంత్రి శ్రీధర్‌బాబు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కక్షపూరిత రాజకీయాలు చేస్తోం దని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. 12 ఏళ్ల క్రితం నాటి నేషనల్ హెరాల్డ్ కేసు ను ఇప్పుడు తెరపైకి తీసుకురావడంలో వెనుకున్న ఆంతర్యమేమిటని నిలదీశారు. కక్షపూరిత రాజకీయాలకు స్వస్తిపలికి ప్రజాసమస్యలపై దృష్టి సారించాలన్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేకనే..: మంత్రి దామోదర
రాహుల్‌గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేకనే బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. తగి న సమయంలో బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలతో గాంధీ కుటుబాన్ని భయపెట్టాలనుకుంటే..కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు.
ధర్నాలో మం త్రులు తుమ్మల నాగేశ్వరావు, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, ఎమ్మెల్సీలు, ఎమ్మె ల్యేలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.