calender_icon.png 30 April, 2025 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంజయ్ సింగ్వి ఆశయాలను సాధించడమే నిజమైన నివాళి

30-04-2025 12:00:00 AM

సూర్యాపేట, ఏప్రిల్ 29: సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు, టియుసీఐ ఆలిండియా కార్యదర్శి కామ్రేడ్ సంజయ్ సింగ్వి ఆశయాలను సాధించడమే మనమిచ్చే నిజమైన నివాళి అని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో ఆయన మృతికి సంతాపం తెలుపుతూ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ..... గత 40 ఏళ్లుగా కామ్రేడ్ సంజయ్ కార్మికోద్యమంలో, విప్లవోద్యమంలో ముఖ్యపాత్ర వహించారన్నారు. అనేక కార్మికుల కేసులను వాదించడమే కాక సంఘటిత రంగా కార్మికులను ఉద్యమ బాటలో నడిపాడన్నారు. సిపిఐ(ఎం.ఎల్) ప్రజాపంథా, సిపిఐ (ఎం.ఎల్) రివల్యూషనరీ ఇన్సియేటివ్, పిసిసి సిపిఐ (ఎం.ఎల్) ఈ మూడు పార్టీల ఐక్యతలో కీలక పాత్ర పోషించాడన్నారు. ఖమ్మంలో గత సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఐక్యత మహాసభలో చురుకైన పాత్ర వహించాడని గుర్తు చేశారు.

కామ్రేడ్ సంజయ్ మరణం భారత కార్మిక ఉద్యమానికి, విప్లవోద్యమానికి, ప్రత్యేకించి సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీకి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, ఎఐపికెఎంఎస్ రాష్ట్ర నాయకులు పేర్ల నాగయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య, టియుసీఐ జిల్లా నాయకులు ఎస్కే. సయ్యద్ లు పాల్గొన్నారు.