నిర్మల్, నవంబర్ 15 (విజయక్రాంతి): ఐక్యతతోనే హక్కులు సాధించుకోగలుగుతామని టీజీ జేఏసీ చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో శుక్ర వారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేపట్టి ఏడాది గడిచిందని, కానీ, ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేస్తున్నదన్నారు. దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తామని హమీ ఇచ్చిందన్నా రు. ప్రభుత్వం అప్పుల్లో ఉండడంతో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ వాటిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమస్యలను పరిష్కరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.
కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు లింగన్న, ఇతర నాయకులు ప్రభాకర్. లక్ష్మణ్, రవికుమార్, గజేందర్, భూమ న్న యాదవ్, అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.