19-03-2025 12:13:00 AM
సూర్యాపేట, మార్చి18(విజయక్రాంతి): సూర్యాపేట మండలంలోని ఇమాంపేట కస్తూర్బ గాంధీ బాలికల విద్యాలయ విద్యార్ధినిలు వచ్చే పదవ తరగతి వార్షిక పరీక్ష లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాలో ప్రధమ స్థానంలో నిలవాలని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ లు అన్నారు.
మంగళవారం ఇమాంపేట కేజీబివి లో సువేన్ ఫార్మసి కంపెనీ ద్వారా ఏర్పాటు చేసిన షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్ లను ప్రారంబించి విద్యార్ధినిలకు పరీక్ష సామాగ్రి పంపిణి చేశారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలో మొదటి ర్యాంక్ వచ్చిన వారికి క్యాష్ బహుమతి అందజేస్తామనిప్రకటించారు. ఈ కార్యక్రమం లో డిఈఓ అశోక్, సువెన్ ఫార్మా కంపెనీ అధికారులు రమేష్ బాబు, మూర్తి, కేజీబివి ప్రిన్సిపల్ నారాయణమ్మ పాల్గొన్నారు