calender_icon.png 19 March, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఎస్సిలో మెరుగైన ఫలితాలు సాధించాలి

19-03-2025 06:26:39 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించి అత్యుత్తమ జిపిఎస్ సాధించాలని సింగరేణి పాఠశాల కరస్పాండెంట్ శ్యాంసుందర్ కోరారు. పాఠశాలలో బుధవారం నిర్వహించిన పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగించుకున్న పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో అద్భుత ఫలితాలతో, అత్యద్భుత జిపిఏ లు సాధించి సింగరేణి పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, అంతే కాకుండా విద్యార్థుల కుటుంబాలకు మంచి ఫలితాలను అంకితం ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఎస్ఎస్సి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు హాల్ టికెట్లు పరీక్ష ప్యాడ్ లను ఆయన అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం, ఉపాద్యాయులు, సిబ్బంది, 9,10 వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.