calender_icon.png 19 March, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంద శాతం ఉత్తీర్ణత సాధించండి

19-03-2025 12:00:00 AM

సబ్ ఇన్స్పెక్టర్‌కు సన్మానం

మహబూబాబాద్. మార్చి18 . (విజయ క్రాంతి) మహాబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఎదుళ్ల పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం లో స్థానిక ఎస్సై పోలోజు కుశకుమార్ కార్య క్రమానికి ప్రత్యేక అతిధిగా పాల్గొని, పాడ్లు, పెన్నులు, ఇతర సామాగ్రి స్వయంగా అంద జేశారు. విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించి మండలానికి పేరు తేవాలని ఆశా భావం వ్యక్తం చేశారు.

వారి సేవా భావానికి ప్రతిగా ఉపాధ్యాయులు ఎస్సై కుశకుమార్‌ని సన్మానించారు. మండల విద్యాధికారి గుమ్మ డి లక్ష్మీ నారాయణ తను రచించిన ‘ఆది యోధులు - అజరామరులు’ పుస్తకాన్ని ఎస్సై కి బహుకరించారు. ఉపాధ్యాయులు ఎం.డి మస్తాన్, ధనుసరి అంజయ్య, వెం కటేశ్వర్లు, వేణు, కృష్ణమోహన్, ఎలేంద్ర, సుజాత, రామస్వామి, పిఎస్ హెచ్‌ఎం కన్నయ్య, ము ల్కం వీరస్వామి, ఈసాల లక్ష్మయ్య, సారం గపాణి, దాత మోహన్‌లాల్ పాల్గొన్నారు.