మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. పద్మావతి కాలనీలోని జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని ధారబోసారని పేర్కొన్నారు. తొలిదశ నుంచి మలి దశ ఉద్యమం దాకా తెలంగాణ సాధన దిశగా ప్రొఫెసర్ జయశంకర్ చేసిన భావజాల వ్యాప్తి, దశాబ్దాలపాటు సాగిన ఉద్యమంలో వారు అందించిన పోరాటస్ఫూర్తి గొప్పదన్నారు.
మలిదశ ఉద్యమంలో కెసిఆర్ కి మార్గ నిర్దేశం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినట్లు చెప్పారు. చివరి దాకా శాంతియుత పద్ధతిలో, పార్లమెంటరీ పంథాలో ప్రజా ఉద్యమాన్ని కొనసాగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ నర్సింహులు, డీసీసీబీ వైస్ ఛైర్మన్ వెంకటయ్య, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, కౌన్సిలర్ కట్ట రవికిషన్ రెడ్డి, రైతు కమిటీ మాజీ అధ్యక్షులు గోపాలయాదవ్, ముడా మాజీ డైరెక్టర్ సాయిలు, సీనియర్ నాయకులు ఇమ్రాన్, ధన్రాజ్, నయీమ్, కిషన్ పవర్ తదితరులు పాల్గొన్నారు.