calender_icon.png 22 April, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఏసీఈ

22-04-2025 12:01:15 AM

విజయ్ సేతుపలి ప్రధాన పాత్రలో నటించిన తాజాచిత్రం ‘ఏసీఈ’. ఈ సినిమాను 7సీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అరుముగకుమార్ స్వీయ దర్శకత్వం వహిస్తూ ఆయనే నిర్మిస్తున్నారు. ఇందులో రుక్మిణీ వసంత్ కథానాయిక కాగా, యోగిబాబు, బీఎస్ అవినాష్, దివ్య పిళ్లు, బబ్లూ, రాజ్‌కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ మొత్తం మలేషియాలో జరిగింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్, గ్లింప్స్, పాటలు విడుదలయ్యాయి. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. మే 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సినిమాకు డీవోపీ: కరణ్ బహదూర్ రావత్; నేపథ్య సంగీతం: సామ్ సీఎస్; స్వరాలు: జస్టిన్ ప్రభాకరన్; ఎడిటర్: ఫెన్నీ ఆలివర్; ఆర్ట్: ఏకే ముత్తు.