calender_icon.png 7 February, 2025 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌ను బెదిరించిన 26/11 నిందితుడి కొడుకు

07-02-2025 01:01:09 AM

న్యూఢిల్లీ, జనవరి 6: భారత్ నుంచి కశ్మీర్‌కు విముక్తి కలిగిస్తానని 26/11 ముంబై దాడుల నిందితుడు హఫీజ్ మహ్మద్ సయీద్ కొడుకు హఫీజ్ తల్హా సయీద్ ప్రతిజ్ఞ చేశాడు. ‘కశ్మీర్ సంఘీభావ దినం’ సందర్భంగా లాహోర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘భారత ప్రధాని మోదీ ఓ సైతాన్. కశ్మీర్ ముస్లింలది.

కశ్మీర్‌ను త్వరలోనే స్వాధీనం చేసుకుంటాం.’ హ ఫీజ్ మహ్మద్ సయూద్‌ను వెంటనే జై లు నుంచి విడుదల చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. దోషిగా తేలనప్పుడు జైల్లో బంధించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించాడు. ఉ గ్రవాద కార్యకలపాలకు సం బంధించిన అనేక కేసులు నమోదవడంతో పాక్ ప్రభుత్వం అతడ్ని అరెస్ట్ చేసింది.