13-02-2025 02:04:22 PM
ఎల్బీనగర్ జిల్లా కోర్టులో కలకలం
ఎల్బీనగర్: ఎల్బీనగర్ జిల్లా కోర్టులో కేసు విచారణ సందర్భంగా ఒక నిందితుడు గురువారం న్యాయమూర్తిపై చెప్పు విసిరిన ఘటన కలకలం రేపింది. బుధవారం ఓ కేసులో జీవిత ఖైదీ శిక్ష పడిన నిందితుడు గురువారం ఇంకో కేసు విషయంపై రంగారెడ్డి జిల్లా కోర్టుకు వచ్చాడు. జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా న్యాయమూర్తిపై చెప్పు విసిరాడు. జడ్జి దగ్గరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేసి దాడికి ప్రయత్నించగా పోలీసులు అప్రమత్తమై దూరంగా తీసుకపోవడంతో ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.