calender_icon.png 12 March, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యాచారం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి

07-03-2025 05:31:00 PM

బాధితురాలికి ప్రభుత్వం న్యాయం చేయాలి

ఆసుపత్రి ఎదుట ప్లెకార్డులతో నిరసన

సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలో దళిత ఆశా కార్యకర్త మీద పిబ్రవరి 27న శివరాత్రి పండుగ డ్యూటీ చేసి ఇంటికి తిరిగి వెలుతున్న ఆశ కార్యకర్తపై అత్యాచారం, దాడిని కఠినంగా శిక్షించాలని సీఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్(CITU District Secretary Dumpala Ranjith Kumar) డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా  సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ... నిందితున్ని వెంటనే ఎస్సీ/ఎస్టి చట్టంలోని సెక్షన్స్ ప్రకారం కఠినంగా శిక్షించాలన్నారు.

బాధిత ఆశా వర్కర్ కు చట్ట ప్రకారం కాంపన్షేన్ ఇచ్చి ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాలలో జరిగిన ఈ సంఘటన అత్యంత బాధాకరమని సిగ్గుచేటు అని అన్నారు. ఈ నేరానికి పాల్పడిన నిందుతిన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. ఈ అత్యాచార సంఘటనలు దేశంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. బేటీ బచావో బేటీ పఢావో లాంటి పథకాల ద్వారా మహిళలను ప్రసన్నం చేసుకోజూస్తున్న ప్రభుత్వం దేశంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ, భద్రత కల్పించడంలో సంపూర్ణంగా విఫలమైందన్నారు. ఓవైపు మహిళలు పగటిపూట పని చేస్తుంటేనే రక్షణ కరువైన పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం మరో వైపు పాత కార్మిక చట్టాలను మార్చి నాలగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ మహిళలు రాత్రుల్లు కూడా పని చేయాలనడం మహిళల రక్షణను గాలికొదలడమే అవుతుందన్నారు.

కాబట్టి కొత్త లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, పాత కార్మి చట్టాలనే బే షరతుగా కొనసాగించాలన్నారు. షీ టీంలు, సఖి సెంటర్ల వలన ఎంతమందికి సర్వీసు అందుతుందని, వాటి సంఖ్యను పెంచాలన్నారు. మహిళల రక్షణ కోసం పోలీసు బలగాలలో మహిళా సిబ్బంది కేవలం 10% మాత్రమే ఉందని, మహిళా సిబ్బందిని 33% శాతానికి పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.  నిర్భయకు నిధులు సరిపడా లేవనీ, దిశ చట్టం యాపు వరకే పరిమితమైందని విమర్షించారు. కాబట్టి మహిళల రాత్రి షిఫ్ట్ లను రద్దు చేయాలని, రోజుకు ఎనమిది గంటల పనిదినాన్ని అమలు చేయాలన్నారు. ముఖ్యంగా అశాలు గర్బిణీ స్త్రీల ప్రసవం కోసం అర్ధరాత్రుల్లో సైతం పేషంటుతో దవాఖానాకు వెల్లేలా నిబంధనలు పెట్టారన్నారు.

ఈ నిబంధన సవరించి ఆశాల చేత రాత్రిపూట పని చేపించే, అదనపు పనులు చేపించే విధానాన్ని ప్రభుత్వం రద్దుచేయాలన్నారు. ఆశాలందరికీ రక్షణ కల్పించాలన్నారు. జగిత్యాలలో దళిత ఆశా మీద జరిగిన అఘాయిత్యానకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియుగా నిరసన తెలియజేస్తున్నామని, వెంటనే ప్రభుత్వం బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని, మెరుగైన వైద్యం అందించి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని, బాధితురాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, నిరుపేదరాలైన ఆమెకి ఇల్లు కట్టించిఇవ్వాలని, సమాజంలో గౌరవంగా జీవించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వమే చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో  జ్యోతి, లక్ష్మి సతీష్,చిట్యాల నవీన్, తదితరులు పాల్గొన్నారు.