calender_icon.png 2 April, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష

27-03-2025 12:26:37 AM

మేడ్చల్, మార్చి 26(విజయ క్రాంతి): మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికను రోజు వెంబడిస్తూ, ప్రేమ పేరుతో వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి నేరేడుమెట్ లోని పోక్సో కోర్టు న్యాయమూర్తి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఖమ్మం జిల్లా చంద్రగుంట మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన ఎస్కే రహమత్ అలియాస్ మధు మౌలాలిలోని గణేష్ నగర్ లో నివాసం ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. ఒక బాలికను వేధించడంతో మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. నిందితుడికి ఐదేళ్ల  కారాగార శిక్షతో పాటు, 20వేల రూపాయల జరిమానా విధించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుశీల వాదనలు వినిపించారు.