ఆదిలాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు చెట్ల పోశెట్టి అలియాస్ అనిల్‌ను పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 21న మతిస్థిమితం లేని బాలికను పోశెట్టి గుడిహత్నూర్‌లోని తన ఇంట్లో బంధించి, లైంగిక దాడికి పాల్పడటంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో సీఐ, ఎస్సైలు సైతం గాయపడ్డారు. పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.