calender_icon.png 3 February, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్రాసిటీ కేసులో నిందితుడి రిమాండ్

29-01-2025 10:37:00 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని చందారం గ్రామానికి చెందిన మిల్కురి మల్లేష్ వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు కాగా నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగ న్యాయమూర్తి అసదుల్ల షరీఫ్ 14 రోజుల రిమాండు విధించినట్లు బుధవారం సాయంత్రం ఎస్సై సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడు ఈనెల 25న రంగపేట గ్రామానికి చెందిన అవునూరి రాజయ్య అనే వ్యక్తికి వారసత్వంగా వచ్చిన భూమిలో సాగుచేసుకుంటున్నాడన్నారు. ఆ భూమిని నిందితుడు పల్లికొండ రమేష్ అనే వ్యక్తి వద్ద భూమి కొన్నానని, ఇది నా భూమి అని ట్రాక్టర్ వీల్స్ తో పంటను ధ్వంసం చేసి రాజయ్యను కులం పేరుతో దూషించడన్నారు. అంతేకాకుండా బూతులు తిట్టి కాలర్ పట్టి పొలంలో నెట్టేయగా బాధితుడు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అదేరోజు నిందితునిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ విచారణ చేపట్టిన అనంతరం కోర్టులో నేడు హాజరుపర్చగా న్యాయమూర్తిపై విధంగా నిందితునికి రిమాండ్ విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.