calender_icon.png 11 January, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసి మహిళపై అత్యాచారం, హత్యా యత్నం చేసిన నిందితుడిని ఉరి తీయాలి

06-09-2024 03:47:00 PM

తాండూర్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆదివాసి నాయకుల నిరసన

బెల్లంపల్లి,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసి మహిళపై అత్యాచారం జరిపి హత్యా యత్నానికి పాల్పడిన నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆదివాసి నాయకులు తాండూర్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. నిందితుడిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వినతి పత్రాన్ని ఎస్సై కిరణ్ కుమార్, ఆర్ ఐ అంజనీ కుమార్ లకు అందజేశారు. 

గత నెల 31న జైనూర్ మండలంలో తన సోదరునికి రాఖీ కట్టేందుకు వెళ్తున్న ఆదివాసి మహిళను నమ్మించి ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం జరిపి హత్య చేయడానికి ప్రయత్నించి చనిపోయిందని భావించి నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఆరోపించారు. ప్రాణాపాయం స్థితిలో ఉన్న మహిళను ఆసుపత్రికి తరలించడంతో విషయం వెలుగులోకి వచ్చిందని వాడు పేర్కొన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆదివాసీలకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో ఆదివాసి నాయకులు మండి గ రవీందర్, మండల ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, మాజీ కొలవార్ సేవ సంస్థ అధ్యక్షులు బోగారపు సంతోష్, మాజీ సర్పంచ్ మణికుమార్, ఉరడి మహేష్, చిలుకయ్య పాల్గొన్నారు.