మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో ఈ నెల 8 తేదీన మహిళను హత్య చేసి సంచిలో మూటకట్టి వ్యవసాయ బావిలో వేసిన దారుణ ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే మృతి చెందిన మహిళల ను ముత్తారం రాజేశ్వగా గుర్తించిన పోలీసులు, నిందుతుల కోసం వేటాడాతున్నారు. ఎట్టకేలకు బుధవారం రాత్రి హత్య చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, మంథని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ మధుసూధన్ రావు లు పకడ్బందీగా నిందితులను గుర్తించి వారని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.