calender_icon.png 20 April, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళపై యాసిడ్ దాడి నిందితుడికి 20 ఏళ్ల జైలు

17-04-2025 01:49:48 AM

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): మహిళపై యాసిడ్ తో దాడి చేసి హత్య యత్నం చేసిన కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు,  జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన బచ్చనబోయిన అలియాస్ పిట్టల మహేష్ తండ్రి పెద్దయ్య అదే గ్రామానికి చెందిన మహిళను వేధించి యాసిడ్ తో చంపేందుకు యత్నించగా బాధితురాలు నిందితుడు పిట్టల మహేష్ పైన నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన పిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేశారు.

బుధవారం  నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడికి సెక్షన్ 307 ఐపీసీ (హత్యాయత్నం)కింద నేరానికి పదేళ్ల  జైలు శిక్ష,  రూ.1000/- జరిమానా, సెక్షన్ 326-ఏ ఐపిసి(యాసిడ్ దాడి)కింద  పదేళ్లn జైలు శిక్ష,  రూ.1000/- జరిమానా రెండూ ఏకకాలంలో (10+10= 20 సంవత్సరాల జైలు శిక్ష మరియు మొత్తం జరిమానా మొత్తం 2000/-) విధించడం జరిగిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.

ఈ కేసులో సరైన ఆధారాలను సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించి నిందితునికి శిక్ష పడే విధంగా కృషి చేసిన అప్పటి విచారణ అధికారులు ఎస్.మహేశ్వర్, ఎస్ డి పి ఓ దేవరకొండ, డి.విజయ్ కుమార్, ఎస్ ఐ. ఆఫ్ పోలీస్, పి. ఎస్, నాంపల్లి , ప్రస్తుత  ఏ ఎస్ పి,  పి.మౌనిక, ఐపీఎస్ దేవరకొండ, సి. ఐ, డి.రాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నాంపల్లి సర్కిల్, ఎస్ హెచ్ ఓ, ఎం.శోభన్ బాబు, సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఏ పి పి, ఆర్.అఖిల, సిడి ఓ బి.సైదులు, లైజన్ అధికారులు పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్  లను జిల్లా ఎస్పీ  అభినందించారు