calender_icon.png 19 March, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగతనం కేసులో నిందితురాలి రిమాండ్

18-03-2025 10:54:09 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని గోదావరి రోడ్డుకు చెందిన కొత్త శ్యామల అనే మహిళ మెడలో బంగారు గొలుసు దొంగిలించిన నిందితురాలు సముద్రాల వసంతను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని సిఐ అల్లం నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం... బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించిన ఎదురు ఇంట్లో ఉండే నిందితురాలు వసంత పథకం ప్రకారం.. శ్యామల మెడలోని సుమారు 3 తులాల బంగారు పుస్తెల తాడు లాక్కొని పరార్ అయ్యిందన్నారు. బాధితురాలు శ్యామల పిర్యాదు మేరకు పారిపోయిన మహిళను అదుపులోకి తీసుకొని గొలుసు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.