calender_icon.png 22 January, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో నిందితుడికి పోలీస్ కస్టడీ

21-01-2025 01:17:07 AM

* కోర్టులో నాటకీయ పరిణామాలు

* నిందితుడి తరఫున వాదించేందుకు ఇద్దరు లాయర్ల గొడవ

* సయోధ్య కుదిర్చి జట్టుగా వాదించమని జడ్జి ఆదేశం

ముంబై, జనవరి 20: సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు నిందితుడిని హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిందితుడు షెహజాద్ మహ మ్మద్(30) తరపున వాదించేందుకు ఇద్దరు లాయర్లు గొడవపడ్డారు.

దీంతో న్యాయమూర్తి వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చాల్సి వచ్చింది. నిందితుల బోనులో నిలబడి ఉన్న షెహజాద్‌ను పోలీసులపై ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. దానికి అతడు వ్యతిరేకంగా సమాధానం ఇచ్చాడు.

ఈక్రమంలో షెహజాద్ వద్దకు వెళ్లిన ఓ లాయర్.. అతడి తరఫున వాదిస్తానంటూ వకాలత్ పత్రంపై సంతకం చేస్తుండగా మరో లాయర్ సైతం తానూ వాదిస్తానని వకల్తా పత్రాలపై సంత కం కోసం ప్రయత్నించాడు. దీంతో ఇద్దరు లాయర్లు కోర్టు హాలులోనే వాదులాడుకున్నారు. దీంతో న్యాయమూర్తి జోక్యం చేసు కున్నారు.ఆ తర్వాత నిందితుడిని ఐదు రోజు ల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశించారు.