calender_icon.png 28 March, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఎంటీస్ అత్యాచార యత్నం కేసు... పోలీసు కస్టడీలో నిందితుడు

25-03-2025 12:53:47 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): భాగ్య నగరంలో వరుస దారుణాలు జరగుతున్నాయి. తాజాగా మరో దారుణం హైదరాబాద్ ఎంఎంటీస్ రైలు వేదికగా జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆదివారం రాత్రి ఎంఎంటీస్ రైలులో ప్రయాణిస్తున్న ఓ యువతిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన కేసులో రైల్వే పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన జంగం మహేష్‌గా పోలీసులు గుర్తించారు.అయితే, పోలీసులు నిందితుడి ఫోటోను బాధితురాలికి చూపించగా ఆమె అతన్ని గుర్తించలేకపోయిందని సమాచారం. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాడి సికింద్రాబాద్ నుండి మేడ్చల్ వరకు 28 కిలోమీటర్ల రైలు మార్గాన్ని కవర్ చేస్తూ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన బాధితురాలు ప్రస్తుతం మేడ్చల్‌లో నివసిస్తూ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఆదివారం సాయంత్రం, ఆమె తన మొబైల్ ఫోన్ రిపేర్ చేయించుకోవడానికి సికింద్రాబాద్‌కు వెళ్లింది. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌లో యువతి ఎంఎంటీస్ రైలులోని మహిళల కంపార్ట్‌మెంట్ ఎక్కింది. రాత్రి 8.15 గంటల ప్రాంతంలో కంపార్ట్‌మెంట్‌లోని మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్‌లో దిగేసరికి, ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. ఆ తర్వాత ఒక దుండగుడు ఆమె దగ్గరకు వచ్చి ఆమెను అనుచితంగా తాకినట్లు తెలిపింది. అత్యాచారయత్నం చేశాడు. దీంతో యువతి భయంతో అతడి నుంచి తప్పించుకునేందుకు కొంపల్లి సమీపంలో కదులుతున్న రైలు నుండి దూకేసింది, గాయపడిన యవతిని స్థానికులు 108 అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. మహిళలకు సంబంధించిన భోగీలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ విధులు నిర్వహించాల్సిన వారు.. ఎందుకు లేరు అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనిపై రైల్వే శాఖ సమగ్ర విచారణకు ఆదేశిస్తుందా లేదా అనేది చూడాలి.