నల్లగొండ, జనవరి 30 (విజయక్రాంతి) : గంజాయి కేసులో నిందితుడికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ నకిరేకల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ కోర్టు జడ్జి షేక్ ఆరిఫ్ గురువారం తీర్పునిచ్చారు. కేసు వివరాలివి.. గతేడాది ఆగస్టు 29న నాటి కట్టంగూర్ ఎస్. ఐ ఎన్ శ్రీను సిబ్బందితో కలిసి నల్లగొండ రోడ్డులో వాహనాల తనిఖీ చేపట్టారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు బైక్‌పై వెళ్తున్నవ్యక్తిని ఆపి తనిఖీ చేయగా బ్యాగులో 300 గ్రాములు గంజాయి, 15 తులాల బంగారు అభరణాలున్నాయి.
అదుపులోకి తీసుకునే క్రమంలో కానిస్టేబుల్ ఉదయ్ కుమార్ చెయ్యి కొరికి పరారయ్యేందుకు యత్నించగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని ఏలూరు మండలం జంగారెడ్డి గూడేనికి చెందిన పోలవరపు నాగదుర్గా ప్రసాద్‌గా గుర్తించి రిమాండ్‌కు తరలించారు.
బంగారు అభరణాలు ఏపీలో దొంగిలించడంతో అక్కడి పోలీసులకు అప్పగించారు. గంజాయి సరఫరాపై దర్యాప్తు జరిపిన శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి నివేదికను కోర్టుకు సమర్పించగా నేరస్తుడికి శిక్ష ఖరారు చేస్తూ జడ్జి తీర్పునిచ్చారు. విచారణకు ప్రస్తుత ఎస్‌ఐ రవీందర్ కోర్టు కానిస్టేబుల్ వెంకన్నసహకరించించగా.. ప్రాసిక్యూషన్ తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే విజయ వాదించారు.