calender_icon.png 1 April, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలిక వెంటపడిన కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు

29-03-2025 12:59:02 AM

జగిత్యాల, మార్చి 28 (విజయక్రాంతి): జిల్లాలోని కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన నిందితుడు ఎండి.అంకుష్ అనే 20 ఏళ్ల వ్యక్తి ఓ మైనర్ బాలికను ప్రేమిస్తున్నా నని వెంటపడి, అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై 2019 సంవత్సరంలో కోడిమ్యాల పోలీస్ స్టేషన్లో అప్పటి ఎస్‌ఐ శివకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశా రు.

శుక్రవారం సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టగా, న్యాయమూర్తి నీలిమ సాక్ష్యులను విచారించి, నేరం రుజువవడంతో నిందితు డికి 2 ఏళ్ల జైలు శిక్షతో పాటూ రూ. 25 వేలు జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు. కాగా ఈ కేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పీపీ రామకృష్ణరావు, సిఎంఎస్ ఎస్‌ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ సాగర్, సిఎంఎస్ కానిస్టేబుల్ కిరణ్, రాజులను జిల్లా ఎస్పీ  అశోక్’కుమార్ అభినందించారు.