calender_icon.png 25 November, 2024 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు హతం

25-11-2024 01:05:21 AM

  1. ఢిల్లీలో ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు
  2. పోలీసుల అదుపులో మరో ఇద్దరు 

న్యూఢిల్లీ, నవంబర్ 24: కానిస్టేబుల్ కిరణ్‌పాల్ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న రాఘవ్‌ను ఢిల్లీలో పోలీసులు ఆదివారం ఎన్‌కౌంటర్ చేశారు. అధికారులు తెలిపిన ప్రకారం సంగం విహార్ ప్రాం తంలో నిందితుడు ఉన్నాడనే పక్కా సమాచారంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టు ముట్టి లొంగిపోవాలని సూచించారు. ఈ క్రమంలో అతడు పోలీసుల పై కాల్పులు జరిపాడు.

దీంతో ప్రాణ రక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, రాఘవ్ అతడి స్నేహితులు దీపక్ మాక్స్, క్రిష్ గుప్తా లు శుక్రవారం అర్ధరాత్రి గోవింద్‌పూరీ ప్రాంతంలో స్కూటీపై తిరుగుతూ హల్‌చల్ చే శారు. అదే సమయంలో పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ కిరణ్ వాళ్లను ఆపే ప్రయత్నం చేయగా కత్తితో దాడికి తెగబడ్డా రు.

తీవ్రంగా గాయపడ్డ కిరణ్ ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలిం పు చర్యలు చెపట్టి దీపక్, క్రిష్‌లను శనివారం అరె స్ట్ చేశారు. రాఘవ్‌ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా అతడు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.