calender_icon.png 19 March, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పలమ్మ పూజారి హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు

18-03-2025 08:29:07 PM

కల్లూరు,(విజయక్రాంతి): మండల పరిధిలో చెన్నూరు గ్రామానికి చెందిన పాటిబండ్ల శ్రీనివాసరావు అనే  ఉప్పలమ్మ పూజారి హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా 6వ అదనపు జడ్జి సత్తుపల్లి తీర్పు ఇచ్చారు. పాటిబండ్ల శివ ఇంటిలో కొన్ని సమస్యలు, పశువులు చనిపోతున్నాయని నూతలపాటి నారాయణరావు అనే వ్యక్తి తల్లాడ మండలం మల్లారం గ్రామానికి  చెందిన పాస్తం రంగారావును కలిసి సమస్య చెప్పారు. శివ ఇంటిలో జరుగుతున్న సమస్యలకి, పశువులు చనిపోవడానికి ఉప్పలమ్మా పూజలు చేసే పాటిబండ్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి కారణమని రెచ్చగొట్టాడు.

అతడిని చంపితేనే ఇంట్లో సమస్యలు తీరుతాయని చెప్పడంతో ఫిబ్రవరి 19వ తేదీన చెన్నూరు గ్రామ శివారులో పొలం వద్ద ఉన్న పాటిబండ్ల శ్రీనివాసరావును శివ అతి కిరాతకంగా నరికి చంపడంతోనే మరించాడని రుజువాయింది. ఈ కేసులో ముద్దాయిలు ఎ1గా పాటిబండ్ల శివ, ఎ5  పస్తం రంగారావులకు వారికి సహకరించిన పాటిబండ్ల నారాయణరావు, కుటుంబ సబ్యులపై దర్యాప్తు చేసి  గతేడాది మే 4న దర్యాప్తు అధికారి సీహెచ్ హనోక్ చార్జి షీట్ దాఖలు చేశారు. ఈ కేసుపై ఇవాళ విచారించిన కోర్టు  ఎ1 శివ, ఎ5 పస్తం రంగారావులకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

ఇట్టి కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్కే అబ్దుల్ బాష సరైన వాదనలు బలముగా  వినిపించగా, దర్యాప్తు అధికారి సీహెచ్ హనోక్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐ పి.రఘు, ప్రస్తుత సీఐ ముత్తులింగయ్య, ఎస్ఐ హరిత,  కోర్టు కానిస్టేబుల్ మల్లికార్జున్, ప్రాసెస్ కానిస్టేబుల్ సుందరం సహకరించినారు. ఈ కేసులో ముద్దాయిలకి శిక్ష పడినందున మృతుడి భార్య పాటిబండ్ల కృష్ణమ్మ, కుమార్తె రమ్య ఖమ్మం కమిషనర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు అయివుండి భయం లేకుండా ధైర్యంగా ఫిర్యాదు చేసి సాక్ష్యం చెప్పినందుకు కమిషనర్ వారిని అభినందించారు.