calender_icon.png 19 March, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిందితుడికి జీవిత ఖైదు, రూ.50,000 జరిమానా

19-03-2025 11:03:15 AM

నిందితుడికి శిక్షపడేలా సాక్షదారులు సమర్పించిన పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ డి జానకి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఫోక్సో కేసులో నిందుతుడికి జీవిత ఖైదీ తో పాటు రూ 50,000 జరిమాన విధిస్తూ తీర్పు వెల్లడించడం జరిగిందని జిల్లా ఎస్పీ డి జానకి తెలిపారు. ఈ సందర్భంగా ఈ కేసు పై జిల్లా ఎస్పీ డి జానకి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భిణీ చేసిన నిందితుడికి నేరం నిరూపితమైనందున, జిల్లా పోక్సో కోర్ట్ న్యాయమూర్తి టి. రాజేశ్వరి మంగళవారం తీర్పును వెలువరించారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. 

నిందితుడు దుప్పల ఆనంద్..

నిందితుడు దుప్పుల ఆనంద్ 21 సంవత్సరాల వయసు ఉంటుందని కేశవాపూర్ గ్రామం, కోయిలకొండ మండలం ప్రాంతానికి చెందిన వారిని పేర్కొన్నారు.  14 ఏళ్ల మైనర్ బాలికపై 2020 డిసెంబర్ 21న అత్యాచారం చేశాడని తెలిపారు. ఈ విషయంపై బాలిక తల్లి దుప్పుల మంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కోయిలకొండ ఎస్సై సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో Cr. No. 138/2020 నమోదు చేసి, IPC 376(3), సెక్షన్ 5(l), (j)(ii), (n) r/w 6 of POCSO Act, 2012 కింద కేసు దర్యాప్తు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. దర్యాప్తును మహబూబూబ్ రూరల్ సీఐ డీకే మహేశ్వరరావు పర్యవేక్షించగా నిందితుడిపై కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయబడిందన్నారు. బీ బాలస్వామి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్  11 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి వాదనలు వినిపించారు. నేరం రుజువైనందున శిక్షణ కరారు చేస్తూ కోర్టు తీర్పునిచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా, జిల్లా ఎస్పీ డి. జానకి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. బాలస్వామి, ఎస్సై సురేష్ గౌడ్, సీఐ డీకే మహేశ్వరరావు, ఏఎస్ఐ బాలకృష్ణ (పోక్సో కోర్ట్ లైసెన్ ఆఫీసర్), పోలీసులు కృష్ణయ్య, శంకర్ నాయక్, శేఖర్ గౌడ్ లను అభినందించారు.