calender_icon.png 1 February, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిందితుడికి 5 ఏళ్ల జైలు

29-01-2025 01:26:45 AM

కోరుట్ల, జనవరి 28: జగిత్యాల జిల్లా  ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని  వర్ష కొండ గ్రామంలో జరిగిన భూతగాదా కేసులో నిందితుడు రేగుంట చిన్న లక్ష్మయ్య ఏ లస్మయ్యకు మె ట్పల్లి అసిస్టెంట్ సేషన్స్ జడ్జ్  డి. నాగే శ్వరరావు  5 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధించా రు ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ పరిధి లోని వర్ష కొండ గ్రామానికి చెందిన సల్వాల రాజేందర్, అదే గ్రామానికి చెందిన చిన్న లక్ష్మయ్యల మధ్య భూ హద్దుల విషయంలో గొడవలు జరుగు తూ ఉండవి.

ఈ గొడవలను మనసులో  పెట్టుకొని 2 సెప్టెంబర్ 2017 రోజున పొలం పనులు చేసుకుంటున్న సల్వాల రాజేందర్ పై రేగుంట చిన్న లక్ష్మయ్య గొడ్డలితో దాడి చేసి హత్యా ప్రయత్నం చేశాడు. బాధితుడి భార్య సల్వాల పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ బి.రామునా యక్  నిందితుడిపై హత్యా యత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

కేసు విచార ణలో భాగంగా మంగళవారం న్యాయమూ ర్తి సాక్షులను విచారించిన అనంతరం నింది తుడు రేగుంట చిన్న లక్ష్మయ్య కు 5సంవ త్సరాలు జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధించారు.

ఈ  కేసులో ఏపీపీగా మల్లేశం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎస్సై  రామునాయక్, లైజనింగ్ కానిస్టేబులు  కవిత, శ్రీధర్, కోర్టు కానిస్టేబుల్  రాజేంధర్  నిందితునికి శిక్ష పడడంలో  కోర్టుకు సాక్షాధారాలు అందించ డంలో  ప్రముఖ పాత్ర వహించడం జరిగిం ది.  నిందితుడికి జైలు శిక్ష పడటంలో కషి చేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అశోక్’కుమార్  అభినందించారు.